వాల్మీకి సంస్కృత రామాయణంలో శ్రీరాముడు : వనం జ్వాలా నరసింహారావు (2024)

వాల్మీకిసంస్కృత రామాయణంలో శ్రీరాముడు

వనంజ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభదినపత్రిక చింతన కాలమ్ (శ్రీరామనవమి, (17-04-2024)}

శ్రీరామాయణం భారతీయ సంస్కృతీ, సనాతన ధర్మ ప్రతిరూపం, దీని మౌలికతత్వాలు, ధర్మ, జ్ఞానాలు. రెండింటినీ వాచ్య-వ్యంగార్థాలతో శ్రీ మద్రామాయణం ఆవిష్కరిస్తోంది. వాల్మీకిఆదికవి. రామాయణం ఆదికావ్యం. ఇది ధ్వని,అర్థ ప్రతిపాదిత మహా మంత్రపూతం. గాయత్రీ బీజసంయుతం. ఔపనిషతత్వసారం. స్మరణ, పారాయణ మాత్రంగా అంతఃకరణశుద్ధి అవుతుంది. కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచిన వాల్మీకిసంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణంలో నాయిక సీతా దేవి. నాయకుడుశ్రీరామచంద్రమూర్తి.

వాల్మీకిదొక విలక్షణమైన శైలి. ఏ విషయాన్నీ ఒకేచోట సంపూర్ణంగా చెప్పడు. ఒకవిషయాన్నే రెండు, మూడు సందర్భాల్లో చెప్పాల్సి వస్తే, అక్కడకొంచెం, అక్కడ కొంచెం చెప్తాడేకాని, మొదట్లోనే అంతా చెప్పడు. ఒక సందర్భంలో వనవాసానికి వచ్చేటప్పటికి శ్రీరాముడికి 25 సంవత్సరాలని చెప్పాడు. అంటే, వనవాసం వెళ్ళేటప్పుడు 25సంవత్సరాలనీ, విశ్వామిత్రుడి వెంట పోయేటప్పుడు12 సంవత్సరాలనీ అనుకోవాలి. పన్నెండోనెలలో శ్రీరాముడి జననం, పన్నెండో ఏట విశ్వామిత్రుడితోవెళ్ళడం, పన్నెండేళ్లు అయోధ్యా వాసం, పద్నాలుగేళ్లుఅరణ్యవాసం, పన్నెండేళ్లు సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో నివాసం.ఈ పరంపరలోనే సీతారాముల కల్యాణం ఎప్పుడు జరిగిందో రాస్తాడు వాల్మీకి.

ఆంధ్రవాల్మీకి,కవిసార్వభౌమ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం మందరం,అయోధ్యాకండ చివర్లో శ్రీరాముడి దినచర్య గురించి వివరించారు. సాధువులనురక్షించడానికి, పాపాత్ములను నాశనం చేయడానికి, ధర్మ స్థాపన కొరకు, ప్రతియుగంలోశ్రీమన్నారాయణుడు భూమ్మీద అవతరిస్తుంటాడు.

{ఈఅవతారాలే మళ్లీ, మళ్లీ పునరావృతమవడం వల్ల, ఇప్పటికి ఎన్ని మత్స్యావతారాలు,నృసింహావతారాలు, శ్రీరామావతారాలు, కృష్ణావతారాలు అయ్యాయో చెప్పడం కష్టం. మళ్లీ,మళ్లీ అవతారాలు వచ్చినప్పుడు, వారితో పాటే మళ్లీ-మళ్లీ హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు,బలిచక్రవర్తి, రావణ, కుంభకర్ణులు, కంస, శిశుపాలులు లాంటి వారు కూడా రావాలికదా?వారు వచ్చినప్పుడు వారి సహాయకులు, సహచరులు, తల్లిదండ్రులు, అవతార పురుషుడికికావాల్సినవారు రావాలి కదా? అలాంటప్పుడు పరిణామవాదం తప్పవుతుంది కదా? అలాగే ముక్తి,జన్మరాహిత్యం అనే పదాలు వ్యర్తమైనవే కదా?

అవతారాలు రావడం నిజమే. వారికికావాల్సినవారు, విరోధులు రావడం కూడా నిజమే. బ్రహ్మేంద్రాదులు, అష్టదిక్పాలకులు,సూర్యచంద్రులు, సప్తర్షులు, అందరూ పుట్టడం యదార్థమే. అయినా పరిణామ వాదం తప్పుకాదు.ముక్తి అనేది వ్యర్థపదం కానేకాదు. బ్రహ్మ, రుద్ర, అగ్ని, వరుణుడు...లాంటి పదాలన్నీఆయా పదవుల పేర్లే కాని ఆ ఉపాధిలో వుండే జీవాత్మల పేర్లు కావు. కలెక్టర్, డిప్యూటీకలెక్టర్, తహసీల్దార్ అనే పదవుల్లో వుండేవారు మళ్లీ-మళ్లీ వచ్చారంటే, అదే మనిషివచ్చాడని అర్థం కాదు. అలాగే బ్రహ్మ, రుద్ర, అగ్ని, వరుణుడు అనే పదవుల్లో వున్నవారుపోగానే, ఆ స్థానం ఖాళీ కాగానే, మరో అర్హుడు ఆ స్థానంలో నియమించబడుతాడు. వాడిఉద్యోగం వాడు చేస్తాడు. ఇలా వచ్చేవాడు భిన్న జీవుడే కాని ఇంతకు ముందు వున్నవాడుకాదు. కాబట్టి పరిణామ వాదానికి ప్రాణ భయం లేదు.....ముక్తుడికి పునర్జన్మ భయం లేదు.ఒక స్థానంలో రెండు జీవులుండవు. జీవయాత్రా విషయంలో పరిణామమే సరైన మార్గం.

వాల్మీకి సంస్కృత రామాయణంలో శ్రీరాముడు : వనం జ్వాలా నరసింహారావు (1)

బ్రహ్మాండకోటులు అనంతం. జీవకోటులూఅనంతమే. ప్రపంచం నిత్యం. సంసారం నిత్యం. కాలం నిత్యం. నది ఒడ్డున నిలుచునిచూస్తుంటే నీళ్లు, నీటి బిందువులు దాటిపోతూనే వుంటాయి. వాటి స్థానంలో మరికొన్నివస్తాయి. ఒక నీటి బిందువు సముద్రంలో ప్రవేశించగానే ఆద్యంతాలలో శూన్య స్థానంలేనట్లే, జీవుడు ముక్తుడు కాగానే ఆ స్థానంలో కాని, ఆదిలో కాని, శూన్యం వుండదు.}

శ్రీరామజననం వైవస్వత మన్వంతరం, త్రేతాయుగంలో జరిగింది. కొడుకులకై దశరథుడు హేవిలంబినామసంవత్సరంలో అశ్వమేధ, పుత్రకామేష్టి యాగాలు చేశాడు. దుర్ముఖి సంవత్సరం చైత్రమాసంలోఅశ్వం విడిచారు. విలంబినామ సంవత్సరంలో శ్రీరామ జననం. మహారాజు పుత్రకామేష్ఠి యాగం చేస్తుండగా, అగ్నిహోత్రం మధ్యనుండి ప్రాజాపత్య మూర్తి బంగారు పాత్రతో వచ్చి, దానినిఆయనకిచ్చి, అందులోని పాయసాన్ని భార్యలతో తాగించమని చెప్పాడు.పాయసం తాగిన భార్యలు గర్భవతులయ్యారు. పన్నెండో నెలలో, (విలంబి)చైత్ర మాసం, శుక్లపక్షం, నవమి తిథి నాడు, పునర్వసునక్షత్రంలో, అభిజిల్లగ్నం, కర్కాటక లగ్నంలో, చంద్రుడిని కూడిన బృహస్పతి కలిగిన బుధవారం ఉదయాన, దశరథుడి జ్యేష్ట భార్య కౌసల్యాదేవిశ్రీమహావిష్ణువు అర్థాంశమూర్తి, శుభ లక్షణాల రఘువంశ వర్ధనుడిని, శ్రీ రాముడికి జన్మనిచ్చింది. శ్రీరాముడి జన్మ లగ్నం కర్కాటకం కాగా,మేషంలో రవి, బుధులు, తులలో శని, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు వున్నారు. శ్రీరామజననంతరువాత, భరతుడు గురువారం పుష్యా నక్షత్రంలోను,లక్ష్మణ-శత్రుఘ్నులు శుక్రవారం ఆశ్లేషా నక్షత్రంలోనూ జన్మించారు.

చైత్రబహుళ పంచమి నాడు శ్రీరామలక్ష్మణ భరతశత్రుఘ్నులకు నామకరణం జరిగింది. పరాభవసంవత్సరంలో తొమ్మిదో ఏట ఉపనయనం జరిగింది. శ్రీరాముడికి 12 ఏళ్ల వయసున్నప్పుడు,సౌమ్యనామ సంవత్సరంలో యాగరక్షణ కొరకు విశ్వామిత్రుడి వెంట అరణ్యాలకు పోయాడు.అరణ్యవాసానికి పోయేటప్పుడు శ్రీరాముడికి 25 సంవత్సరాలని, సీతాదేవికి 18 సంవత్సరాలని, మారీచుడు రావణాసురుడితోసీతాపహరణం ముందర చెప్పినట్లు రామాయణంలో వుంది. శ్రీరాముడికి 12 సంవత్సరాల, సీతకుఆరేళ్ళ వయసులో వారి వివాహం జరిగింది. దీనికి దృష్టాంతరంగా విశ్వామిత్రుడి యాగంకాపాడడానికి రామలక్ష్మణులు వెళ్లిన రోజు నుంచి మిథిలా నగరం వెళ్లడం వరకుతీసుకోవచ్చు. సౌమ్యనామ సంవత్సరం మాఖ బహుళంలో శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్రుడివెంట పోయారు. 15వ నాటి ఉదయం మిథిలా ప్రవేశం చేసి, శివ ధనుర్భంగం చేశాడు. 27 వరోజున శుక్ల త్రయోదశి శుభ దినం కాబట్టి, ఉత్తర ఫల్గుణీనక్షత్రంలో సీతారాముల కల్యాణం జరిగింది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రం శ్రీరాముడి జన్మనక్షత్రానికి ఆరవది.

27వ రోజు ఫాల్గున శుద్ధ త్రయోదశి అయితే, అయోధ్య నుండి బయల్దేరిన రోజు మాఘబహుళ విదియకావాలి. విదియ, హస్తా రోజు ప్రయాణానికి మంచి రోజే. అది శ్రీరాముడికి ధృవతార కూడాఅవుతుంది. కాబట్టి ఆ రోజున హస్త పోయిన తరువాత అభిజిల్లగ్నంలో ప్రయాణమై వుండాలి.సీతారాముల కళ్యాణమైన తరువాత, అంటే, బహుళ విదియతో ముగిసి, తదియనాడు జనకుడు బిడ్డలకుఅరణాలిచ్సిన తరువాత, చవితినాడు అప్పగింతలై, ఫాల్గుణ బహుళపంచమి నాడు అయోధ్యకుప్రయాణమయ్యారు. షష్టి, సప్తముల్లో పరశురాముడి గర్వభంగమైంది. దశమినాడు అయోధ్యప్రవేశం జరిగింది. ఆ తరువాత 12 సంవత్సరాలు సుఖసంతోషాలతో అయోధ్యలో గడిపారు.

దుందుభినామ సంవత్సర చైత్ర శుద్ధ పంచమి నాటి ఉదయం పుష్యా నక్షత్రంలో దశరథుడు, శ్రీరాముడికియౌవరాజ్య పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించాడు. మరో రకంగా చెప్పాలంటే, చైత్రశుద్ధ పంచమే వనవాసారంభమైన రోజు. మర్నాడు గంగాతీర వాసం, ఆ మర్నాడు గుహుడి దర్శనం.అయోధ్య విడిచిన మూడో రోజు సప్తమినాడు జడలు ధరించడం, నాలుగోనాడు అష్టమి రోజునభరద్వాజాశ్రమం వెళ్లడం జరిగింది. ఐదవనాడు నవమిన యమున దాటారు. ఆరవనాడు దశమి రోజునచిత్రకూటమి వెళ్లి వాల్మీకి దర్శనం చేసుకుని, పర్ణశాల నిర్మించుకున్నారు. అదేరోజున అక్కడ అయోధ్యలో దశరథుడు మరణించాడు.

శ్రీరాముడుఅయోధ్య విడిచిన 17 వ రోజున భరతుడు అక్కడికి చేరుకున్నాడు. మర్నాడు తండ్రికి కర్మలుప్రారంభించాడు. 29 వ రోజున కర్మకాండలన్నీ పూర్తయ్యాయి. మర్నాడు 30 వ రోజున వైశాఖశుద్ధ చవితినాడు రాజకర్తలు భరతుడిని రాజ్యభారం వహించమని కోరారు. 31 వ రోజున పంచమినాడు సభకు వచ్చిన భరతుడిని వసిష్ఠుడు పట్టాభిషేకం చేసుకొమ్మని అడిగాడు. భరతుడుతిరస్కరించాడు. వైశాఖ శుద్ధ షష్టి రోజున భరతుడు చిత్రకూటానికి బయల్దేరాడు. అదేరోజున గుహుడిని కలిశాడు. మర్నాడు సప్తమినాడు జడలు ధరించాడు. భరద్వాజుడి విందుస్వీకరించాడు.

34వ రోజున, వైశాఖ శుద్ధ అష్టమి నాడు, చిత్రకూటానికి బయల్దేరి శ్రీరామదర్శనంచేసుకున్నాడు. అదే రోజున రాముడు తండ్రికి నీళ్లు విడిచాడు. 35 వ రోజున రామ, భరతసంభాషణ అనంతరం మర్నాడు భరతుడికి తన పాదుకలను ఇచ్చాడు శ్రీరాముడు. అదే రోజు, అంటే,వైశాఖ శుద్ధ దశమిన భరతుడు అయోధ్యకు చేరాడు. 37 వ రోజున వైశాఖ శుద్ధ ఏకాదశి నాడుభరతుడు నందిగ్రామం చేరాడు. భరతుడు వెళ్ళిపోయిన తరువాత పౌర్ణమి వరకు చిత్రకూటం లోనేవుండి సీతారామలక్ష్మణులు, వైశాఖ బహుళ పాడ్యమినాడు అత్రి ఆశ్రమానికి చేరారు.

అరణ్యవాసంలోభాగంగా, శరభంగ మహర్షి, సుతీక్ష్ణ ముని,మాండకర్ణి, సుదర్శనముని, అగస్త్యుడి ఆశ్రమాలకు, పంచవటికి వెళ్లారు. క్రౌంచారణ్యం, మతంగవనం, పంపానదిఒడ్డునున్న ఋశ్యమూక పర్వతం, ప్రస్రవణ పర్వతం దగ్గర వున్నారు. అప్పుడే సీతాన్వేషణజరిగింది. హనుమంతుడులంక నుండి తిరిగి వచ్చి, సీత జాడ చెప్పడం చెప్పడం పూర్తవగానే, అదేరోజున,ఫాల్గుణ మాసంలో పౌర్ణమినాడు, ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో యుద్ధానికిబయల్దేరుదామని రాముడు అన్నాడు. తగిన ఏర్పాట్లు చేయమన్నాడు.

రాముడు కిష్కింధకుఆగ్నేయంగా వున్న లంకకు పోతున్నప్పుడు, తరచుగా సూర్యుడున్న రాశికి ముందు రాశిలోవుండే శుక్రుడు, అనుకూలంగా వెనుక వున్నాడు. రాముడు బయల్దేరిన ఫాల్గుణ మాసంపౌర్ణిమనాడు సూర్యుడు మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో వున్నట్లు భావించాలి.రాముడిజన్మరాశి కర్కాటకానికిపదవరాశైన మేషంలో శుక్రుడు వుండడంరాముడికి అనుకూలం.వెనుక శుక్రుడు వుండడం కూడా అనుకూలమే.శుక్రానుకూలత చెప్పడం వల్ల బృహస్పత్యాది అనుకూలత కూడా వుంది.బృహస్పతి శ్రీరాములవారి జన్మకాలంలో కటకరాశిలో వున్నాడు.ఇతడికి ఒక్కోరాశిలో ఒక్కొక్క సంవత్సరం నివాసం కాబట్టి పన్నెండేళ్లకుపన్నెండు రాశులను చుట్టి వస్తాడు.అలా మూడుసార్లుచేస్తే ముప్పయ్యారు సంవత్సరాలు గడిచాయి.ముప్పైఎనిమిదోఏట రాముడి దండయాత్ర.

ఆ ఏడు బృహస్పతి రామరాశి,ద్వితీయరాశైన సింహంలో వున్నాడు.గురువు రెండో ఇంట వుండడంఅనుకూలం.రామజన్మకాలంలో శని తులావర్గోత్తమంలో వున్నాడు.శనికి రెండున్నరేళ్లు ఒక రాశిలో నివాసం.తులనుండిపన్నెండు రాశులు చుట్టిరావడానికి ముప్పై సంవత్సరాలు గడుస్తాయి.ముప్పై రెండున్నర దాకా తులలోను,ఆ పైనరెండున్నర వృశ్చికంలోను,ఆపైన రెండున్నర ధనస్సులోనువుండి ఆపైన అంటే,ముప్పై ఏడున్నర ఏళ్ల తరువాత మకరానికిపోవాల్సినప్పటికీ వక్రతాదులవల్ల ధనస్సులోనే వున్నాడని అర్థమవుతున్నది.రామావతారకాలంలో రాహువు సింహరాశిలో వున్నాడు.

రాహువుకు ప్రతిరాశిలోను ఒకటిన్నరసంవత్సరం నివాసం.అప్రదక్షిణ సంచారం.అక్కడినుండిముప్పైఎనిమిదో ఏట కటకరాశిలో వుండాల్సినవాడు మిథునరాశిలో వున్నాడని అనుకోవాలి.రాహువుకు ఏడవ ఇంట కేతువు నివాసం.కాబట్టిఅప్పుడు ధనస్సులో కేతువున్నాడు.ధనస్సు కర్కాటక రాశికిఆరోది.అక్కడున్న శనికేతువులు రాముడికి అనుకూలురు.బుధుడు రాముడికి పదవ రాశిలో వున్నాడు కాబట్టి అనుకూలుడు.చంద్రుడు ఉత్తరఫల్గుణితో చేరి వున్నాడు కాబట్టి కన్యారాశిలో వున్నట్లులెక్క.అప్పటికి తృతీయ చంద్రుడు కాబట్టి రాముడికిఅనుకూలుడు.మీనంలో వున్న సూర్యుడు కటకానికి తొమ్మిదోఇంట వున్నాడు కాబట్టి అనుకూలుడు. మిథునంలో వున్న రాహువు కటకానికి పన్నెండో ఇంటవుండడంవల్ల రాముడికి కొంచెం బాధకలిగిస్తాడు. ఇలా రాముడికి అనుకూలమైన గోచార ఫలాలుకనబడ్డాయి. ఈ గోచారం జన్మరాశినిబట్టి చూపించింది.చంద్రరాశినిబట్టిచూడలేదు.రాక్షసులకు ఈ గోచారం విపరీత ఫలితాన్నేఇస్తుంది. అలాగే, ఇక్ష్వాకు వంశతార విశాఖకాబట్టి నిస్సందేహంగా రాముడికి విజయం చేకూరింది.

(వాసుదాసు గారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరంఆధారంగా)

వాల్మీకి సంస్కృత రామాయణంలో శ్రీరాముడు : వనం జ్వాలా నరసింహారావు (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Carmelo Roob

Last Updated:

Views: 6559

Rating: 4.4 / 5 (65 voted)

Reviews: 88% of readers found this page helpful

Author information

Name: Carmelo Roob

Birthday: 1995-01-09

Address: Apt. 915 481 Sipes Cliff, New Gonzalobury, CO 80176

Phone: +6773780339780

Job: Sales Executive

Hobby: Gaming, Jogging, Rugby, Video gaming, Handball, Ice skating, Web surfing

Introduction: My name is Carmelo Roob, I am a modern, handsome, delightful, comfortable, attractive, vast, good person who loves writing and wants to share my knowledge and understanding with you.